మౌనం
మౌనం రాగమై అనురాగం పలికే
మౌనం భాషయై అనుబంధం తెలిపే
మౌనం భావమై నా గీతం పలికే
మౌనం ప్రాణమై నా ప్రేమను తెలిపే.
ప్రేమతో తెలుసుకుంటే
మౌనమే వినిపించు నా కలలను
మౌనమే పలికించు నా మమతను
మనసుతో చదువుకుంటే
మౌనమే చెప్పవా నా హృదయము
మౌనమే తెలుపదా ప్రేమ భారము.
కన్నులలో కొలువున్నది నీవేనని,
మూసివుంచినా, తెరచి చూచినా
కదలాడే నీడ నీదేనని.. చెప్పాయి
నా కనులు మౌనంగా పలికాయి.
అదిరిపడే అధరాలు
నీ పేరును మౌనంగా తలచాయి
మనసున పదిలంగా దాచాయి.
అడుగుపడితే నీ వైపేనని
ఏడడుగులు నీతో నడవాలని
నా పాదాలు తపన పడ్డాయి
నీకై మౌనంగా వెదికాయి.
(13/02/04)
Monday, August 29, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment