Tuesday, April 23, 2013
16. ప్రేమ పోటు
నువ్వు లేక నేనుండలేనని నీకు తెలుసు,
నీ కోసమే వేచి ఉంటానని నీ అలుసు,
ఎంత చెప్పినా వినదు నా పిచ్చి మనసు,
మళ్లీ మళ్లీ మోసపోతుందని దానికీ తెలుసు,
అయినా,
నీ కోసమే ఎదురు చూడడం దాని అలవాటు,
పట్టనట్టు నువ్వు ఉండటమే నా గ్రహపాటు,
ఆశ పెంచుకోవటం నా పొరపాటు,
ఆశని, నిరాశగా చేయడం ప్రేమ పోటు!
(31/03/04)
15. వసంతం
వసంతమా, వరించుమా! వలపు వీచికవై ఫలించుమా...
మల్లెల సౌరభాలతో.. ప్రేమ మాలికవై చిగురించుమా...
కోకిల స్వర లాహిరితో.. అనురాగ గీతికవై వినిపించుమా...
'తారణ'మా మా పెళ్ళికి కారణమై మము దీవించుమ!
(21/03/04)
Subscribe to:
Posts (Atom)