Tuesday, April 23, 2013

16. ప్రేమ పోటు




నువ్వు లేక నేనుండలేనని నీకు తెలుసు,
నీ కోసమే వేచి ఉంటానని నీ అలుసు,
ఎంత చెప్పినా వినదు నా పిచ్చి మనసు,
మళ్లీ మళ్లీ మోసపోతుందని దానికీ తెలుసు,
అయినా,
నీ కోసమే ఎదురు చూడడం దాని అలవాటు,
పట్టనట్టు నువ్వు ఉండటమే నా గ్రహపాటు,
ఆశ పెంచుకోవటం నా పొరపాటు,
ఆశని, నిరాశగా చేయడం ప్రేమ పోటు!


(31/03/04)

0 comments:

Post a Comment