నీ దూరం
ఏమైనా, ఎపుడైనా, ఏ చోట నేవున్నా...
మనసంతా నీ ధ్యాసే,
మననంలోను, మరణం లోను...
నీ పేరే మది పలికే,
ఊపిరిలోను, ఊహల్లోను...
నీ రూపే యద తలిచే,
కలలోనైనా, ఇలలోనైనా...
నే కోరేది నీ చేరువే,
గతిలోనైనా, చితిలోనైన...
మది వేడేది నీ ప్రేమనే,
నీ దూరం మోసే భారం...
నా హృదయానికి లేదే.
విడిపొతే
క్షణకాలం యుగమై తొచదా!
కలకాలం కన్నీరే మిగలవా!
యదలో వేదన నీకు తెలిపేదెలా!
మాటలు రానంటే, పాటలు రాకుంటే
గుండేల్లొ గుసగుసలు నిను చెరేదెలా!
ఊపిరి లేకుంటే, జీవం మనగలదా!
గుండే లేకుంటే, ప్రాణం నిలిచేదెలా!
నువ్వే లేకుంటే, నేను బొమ్మైపోనా!
బొమ్మై బ్రతికేకంటే, చావే మేలనుకోనా!
నీ దూరం మోసే భారం...
నా హృదయానికి లేదే.
విడిపొతే
యదలో వేదన నే తాళగలనా
గుందే బండైతే బాగుండనుకోనా
మనసూ నీతొ వెళ్ళిపోతే
బ్రతుకే సుడిగుండం దాదా!
నీ దూరం మోసే భారం...
నా హృదయానికి లేదే.
ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా
నా ప్రెమ నీ మది చేరదా!
చేరినా దాని వేదన వినే
తీరికే నీకు లేదా!
కవిత కాదిది మమత అని తెలుసుకోలేవా?
కధ కాదిది వ్యధ అని పోల్చుకోలేవా?
కలిసుంటే కలకాలం
కలలన్నీ ఫలియించవా
మదిలో ఫ్రేమను మన్నించవా?
నా ఆరాధన సఫలం కాకుంటే,
నేనే ఆహుతి కానా!
నా ప్రేమ నిను జయిస్తే,
నీకే హారతి కానా!
(02/11/03)
Wednesday, August 24, 2011
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
నా ప్రేమ నిను జయిస్తే,
నీకే హారతి కానా!
no words ...chala bavundi
చాలా చక్కగా రాశారు. మంచి భావావేశం మీ రచనలో కనిపించింది. హృదయానికి హత్తుకునేలా ఉంది మీ రచన. శుభాకాంక్షలు. నేనో సాహిత్య ప్రియుడ్ని. ఇంకా తెలుసుకోవాలంటే... www.andhaminalokam.blogspot.com చూడండి.
Post a Comment