Monday, August 19, 2013

S1. మా స్నేహం - ఇంద్రధనుస్సు

నేస్తమా,
విరబూసిన “శశి” కాంతుని వెన్నెలలో
విరిసిన “మాధవీ” లతా మాలిక మన స్నేహం
తుషార తరంగ హిమ “శైల” శిఖరాన
ఉవ్వెత్తున ఉప్పొంగే “గంగా” ప్రవాహం మన స్నేహం.
మిత్రమా,
మమతలు విరజిమ్మే మనస్నేహం
“ప్రదీప్తు”లు వెదజల్లే దీపం
మదిలో మెదిలే మధుర “సత్య”o ఈ స్నేహం
మోహన “కృష్ణు”ని మురళీ గానం మన స్నేహం.
నేస్తం,
నిలవాలి ఈ స్నేహం కలకాలం
నీ గుర్తుగా మా గుండె లోతుల్లో
మా గుర్తుగా నీ యద ఘోషల్లో
నిలవాలి ఈ స్నేహం కలకాలం. 

'మరువరాని మన స్నేహం మరులు గొలిపే జ్ఞాపకం'

(August 2000)
This one is a special one. This was written on Friendship day, when we are in college. And the names in the quotations (“ “) are our friends names including us. 
We used to say (proudly) our gang is Rainbow, with 7.

0 comments:

Post a Comment