నువ్వు
నువ్వు లేని తీరం చేరుదామంటే...
ఎంత దూరమైనా నువ్వు నిలిచిన ఈ భూమియే ఉంది
నీ ఊహ నా దరికి రాకూడదనుకుంటే...
నీ శ్వాస చిరుగాలితో నను చేరుతుంది
నీ రూపు కలలోనైనా చూడకూడదనుకుంటే...
నిత్యం నా కన్నులలోనే కనబడుతుంది
నీ పేరు నేనెపుడూ వినకూడదనుకుంటే...
అది నా గుండె చప్పుడై మోగుతుంది
నీ జ్ఞాపకాలు నను ముసురుకోకూడదనుకుంటే...
నిను ప్రేమించిన ఈ మనసే నాతో ఉంది.
*చివరకు ఏమని తేలిందంటే..
నాకు నేను దూరమైతేనే ... నిన్ను నేను మరువగలనని.
(28/02/04)
Monday, September 26, 2011
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
బాగుంది.
నీ పేరు నేనెపుడూ వినకూడదనుకుంటే...
అది నా గుండె చప్పుడై మోగుతుంది
చాలా బావుంది.
నీ ఊహ నా దరికి రాకూడదనుకుంటే..
నీ శ్వాస చిరుగాలితో నను చేరుతుంది
బావుంది.
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కులగజ్జి బ్లాగులు గానీ మతగజ్జి బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ సరికొత్త మార్పులతో రాబోతోంది. చూస్తూ ఉండండి.
Post a Comment