Sunday, September 11, 2011

8. ప్రియా..


ప్రియా..

వెన్నెలమ్మతో జతకట్టావా చందమామ...
కలువ భామ కలలేమైనాయో పాపం

గంగను తెచ్చి తలపై పెట్టావా పరమేశా...
మరి సగం దేహం పార్వతికి ఎందుకయ్యా

 సత్యను కోరి చేసుకున్నావా గోపీలోల...
వలచి వచ్చిన రుక్మిణి ఏమయ్యేనయ్యా

వేరెవరినో కోరుకున్నవా నా ప్రియతమా...
నిన్నే తలచిన నన్నే మరిచావా
నువ్వే మరిచాక ప్రాణం మిగిలేనా!

(28/02/04)

0 comments:

Post a Comment