Friday, September 30, 2011
14 . కృష్ణపక్షం
కృష్ణపక్షం
నడిరాతిరి నిశీధిలో నీకై నే వెదుకుతుంటే
ముసురుకున్న చీకట్లు నన్ను చూసి నవ్వాయి
అమావాస్య తిమిరాలు హేళన చేసాయి
"వెన్నెలా ఏడీ నీ నేలరాజ" ని అడిగాయి
శుక్లపక్షం వచ్చిందని నే సంతోషిస్తూ
పున్నమి రోజున నీకై ముస్తాబవుతుంటే
మబ్బుతెరలు నిన్ను కమ్ముకున్నాయి
అడ్డుగా వచ్చి నన్ను చూడనీకున్నాయి
తప్పుకోమని నేను ప్రాధేయపడితే
"ఎందుకీ మిడిసిపాటు వెన్నెలా...
తెల్లవారితే నీకు కృష్ణపక్షమేగా" అన్నాయి
పట్టరాని దుఃఖంతో నేనుంటే
ఓదార్చవలసిన నీవు మబ్బులతో ముచ్చట్లాడావు
ఏమైనా...
నా జీవితమిక కృష్ణపక్షమేనా!
(01/03/04)
Labels:
mywifewrites
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment