కావాలి
నీ కన్నులలో వెలుగు నేనే కావాలని ఉంది
కలలో నాయికగా మారాలని ఉంది
నీ గొంతులో మాటలు నేనే కావాలని ఉంది
పలుకుల్లో భావంగా మారాలని ఉంది
నీ ఉపిరిలో శ్వాస నేనే కావాలని ఉంది
శ్వాసలో ఆశగా మారాలని ఉంది
నీ గుండెల్లో ప్రాణం నేనే కావాలని ఉంది
గుండె చప్పుడుగా మారాలని ఉంది
నీ నడకల్లో అడుగు నేనే కావాలని ఉంది
అడుగుల్లో తోడుగా మారాలని ఉంది
నీ ప్రతి అణువూ నేనే కావాలని ఉంది
జీవన సహచరిగా మారాలని ఉంది
నీ నీడగా బ్రతుకుదామని ఉంది
నువ్వే లేకుంటే నా జాడ ఎక్కడ ఉంది.
(01/03/04)
Wednesday, September 28, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment