Thursday, September 8, 2011

6. నువ్వు - నేను


నువ్వు -  నేను

నువ్వు తప్ప లోకమే లేనట్టు,
గుండెల్లో నీ రూపు కొలువయ్యేట్టు,
మనసంతా నీ పేరే తలచేట్టు,
నీ కోసమే నా ప్రాణం నిలిచేట్టు,
క్షణం క్షణం ... ప్రతి క్షణం నీకై నేనుంటే..

నన్ను నేను మరిచేట్టు,
చిన్ని గుండె రగిలేట్టు,
కనులు పొంగి పోరిలేట్టు,
మనసు మూగబోయ్యేట్టు,
చేశావు నేస్తమా! నీ కిది న్యాయమా?


(28/02/04)

0 comments:

Post a Comment