నా ప్రాణం
కలలో కొచ్చే నీ రూపం
నా గుండెలో కొలువై ఉంది
పెదవులు తలిచే నీ పేరు
నా గొంతును దాటి రానంది
ప్రేమలు పూచే నా మనసు
అది నిన్నే పూజిస్తానంది
మమతలు పొదిగిన నీ మనసున
నాకే స్థానం కావాలంది
మదిలో మెదిలిన చిరు ఆశ
నీ వైపే పరుగులు తీస్తోంది
నన్నే విడిచిన నా శ్వాస
నిన్నే అల్లుకుపోతుంది
నాలో వుందా నా ప్రాణం
మరి నీలోనేగా అది వుంది.
(28/02/04)
Thursday, September 8, 2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment