Tuesday, September 6, 2011

4. చెప్పలేను, దాచలేను

చెప్పలేను, దాచలేను

ఎన్నెన్ని భాదలో కదిలే కన్నీళ్ళలో
ఎన్నెన్ని భావాలో భారమైన గుండెల్లో
చెప్పలేను, దాచలేను

మోయలేని వెతలవుతున్నా,
బ్రతుకు భారమవుతున్నా
చెప్పలేను, దాచలేను

 కొంటె కన్నీరు నీ చేయి ఓదార్పు కోరుతున్నా...
చిన్ని మనసేమో నీ మనసు తోడు అడుగుతున్నా...
గుండె సడిఏమో నీ నీడ సేదతీరుదామన్నా...
నాలోని నేనేమో నీ ప్రేమ ఎంత వేడుతున్నా...
చెప్పలేను, దాచలేను

చెప్పి చెప్పి నిన్ను నే విసిగించలేను...
దాచి వుంచి నన్ను నే మోసగించలేను...
ఏనాటికైనా నా మనసు తెలుసుకుంటావని,
ఒకనాటికైనా నా కోరిక మన్నిస్తావని,
ఎప్పటికైనా నా ప్రేమ నిను గెలుచుకుంటుందని
ఆశపడుతూ... శ్వాసతీస్తూ... ఎదురు చూస్తూ....

 (21/02/04)

3 comments:

SJ said...

gud

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

"నాకు ఆ కవితలను జాగ్రత్త చెయ్యాలనిపించింది"
నిజమేనా!!!!!!!!!
భలే మంచి వారండీ మీరు!

Krishna said...

Thank you మందాకిని ji.

Post a Comment